ఇంకా మీరు నిజాయతీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి

  • విత్తనాల కోసం రూ.380 కోట్లివ్వాలని అధికారులు కోరారు
  • అయితే ఆ నిధులను బాబు ఎన్నికల ప్రలోభాలకు మళ్లించారు
  • పసుపు-కుంకుమ, పింఛన్ల పేరుతో రూ.30 వేల కోట్లు మాయం చేశారు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో విత్తనాల సేకరణకు రూ.380 కోట్లు విడుదల చేయాలని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ నిధులను ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మళ్లించారని ఆరోపించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో ప్రజలను బురిడీ కొట్టించడానికి రూ.30,000 కోట్లు మాయం చేశారని దుయ్యబట్టారు. అయినా ఇప్పటికీ నిజాయతీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారనీ, ఆయన ధైర్యానికి జోహార్లు చెబుతున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News